స్విట్జర్లాండ్‌పై స్వీడన్‌ విజయం

స్విట్జర్లాండ్‌పై  స్వీడన్‌ విజయం

స్విట్జర్లాండ్‌, స్వీడన్‌ జట్ల మధ్య మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌ లో ఏకైక గోల్‌తో స్వీడన్‌ విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. తొలి భాగంలో ఇరు జట్లు బంతిని తమ ఆదీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించాయి. అయితే స్వీడన్‌ జట్టు స్విస్‌ స్టార్‌ షకిరిని కట్టడి చేయడానికి శ్రమించి సఫలం అయింది. మొదటిభాగంలో స్విస్‌ బంతిని 65 శాతం ఆధీనంలో ఉంచుకుంది. మొదటి భాగం పూర్తయ్యే సమయానికి ఇరు జట్లు ఖాతానే తెరువలేదు. అయితే రెండో భాగంలో మాత్రం ఇరు జట్లకూ అవకాశాలు దక్కడంతో పోటీపడ్డాయి. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌.. స్వీడన్‌ పై ఒత్తిడి పెంచింది. అయితే 66వ నిమిషంలో కార్నర్‌ నుంచి టొవొనెన్‌ ఇచ్చిన పాస్‌ను అందుకున్న ఫోర్స్‌బెర్గ్‌ గోల్‌పోస్ట్‌ దిశగా గట్టిగా కొట్టాడు.. బంతికి స్విస్‌ ఆటగాడు అకంజి అడ్డురాగా... బంతి అతడి కాలికి తగిలి బౌన్స్‌ అయి నెట్‌లో పడింది. దీంతో స్వీడన్‌ 1-0తో ఆఅధిక్యంలోకి వెళ్ళింది. అనంతరం స్విట్జర్లాండ్‌ ఇద్దరు సబ్‌స్టిట్యూట్‌లను బరిలో దింపి గోల్‌ చేసేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద  మ్యాచ్‌' ఏకైక గోల్ చేసిన ఫోర్స్‌బెర్గ్‌ కి దక్కింది.