హిందూపురం వైసీపీలో ముసలం

హిందూపురం వైసీపీలో ముసలం

 అనంతపురం జిల్లాలోని హిందూపురం వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికారపార్టీలో ఉన్న హిందూపురం వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంపై ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ తన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ సమావేశంలో ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు నవీన్ నిశ్చల్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుపేదలకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను నవీన్ నిశ్చల్ 2014లోఎస్సీ రైతులను బెదిరించి తన భార్య పేరున రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపించారు. హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం తిమ్మగానిపల్లి ప్రాంతంలో ఎస్సీ భూములను కబ్జా చేసి బ్యాంకులో 30 లక్షలు లోన్ తీసుకున్నాడని ఈవిషయంపై పోలీసులకు ఫిర్యాదు అందగా భూమి కొనుగోలు చేసిన ఇతని పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందని అన్నారు.

ఇలాంటి వ్యక్తిని వైసీపీ నుంచి బహిష్కరించాలని అధిష్ఠానాన్నికోరుతున్నట్లు వెల్లడించారు. ఎస్సీ భూములను 2014 సంవత్సరంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడంలో సహకరించిన అప్పటి రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పై విచారణ చేపట్టి కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరినట్లు ఆయన తెలిపారు. మరో వైపు టిడిపి నాయకులు కూడా భూకబ్జాలకు పాల్పడ్డారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో నిరు పేద భూములకు కబ్జా ఎవరు పాల్పడ్డారో వారందరిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. నవీన్ నిశ్చల్ ఈ కేసులోత్వరలోజైలుకు వెళతాడని ఎన్నికల్లోచి వరకు వార్డుమెంబర్గా కూడా పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడని అని అన్నారు