బెంగాల్ పోలీసుల ధిక్కరణపై అఫిడవిట్ ఇవ్వండి

బెంగాల్ పోలీసుల ధిక్కరణపై అఫిడవిట్ ఇవ్వండి

శారద చిట్ ఫండ్ కుంభకోణం కేసుల దర్యాప్తుల్లో పశ్చిమ బెంగాల్ పోలీసులు, కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఏ విధంగా ధిక్కరణకు పాల్పడ్డారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్ట్ బుధవారం సీబీఐ డైరెక్టర్ ను ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ సిట్ చీఫ్ గా ఉన్నపుడు రాజీవ్ కుమార్ కాల్ డేటా రికార్డులు తారుమారు చేయడం, ధ్వంసం చేయడానికి పాల్పడ్డారని ఆరోపించేందుకు మీ దగ్గర ఉన్న సమాచారం అందజేయాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం సీబీఐ డైరెక్టర్ కు సూచించింది.

రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బెంచ్ సూచించింది. తదుపరి విచారణను మార్చి 26కు వాయిదా వేసింది. సీబీఐ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, పోలీస్ కమిషనర్ ధిక్కారానికి పాల్పడ్డారని రుజువు చేసేందుకు కావాల్సిన పూర్తి వివరాలు అందజేయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.