జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభంకానుంది. అది కూడా ఓ రాజకీయ పార్టీ ఆధ్వరంలో..! జనసేన ఆధ్వర్యంలో ఓ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పాలకొల్లులో టాలీవుడ్‌ లెజెండ్‌ ఎస్వీ రంగారావు పేరుతో ఈ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొంది. అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ లాంటి ఉద్దండులను సినీ రంగానికి అందించిన ఘనత పాలకొల్లుకు దక్కుతుందని ఆ ప్రకటనలో గుర్తు చేసొంది. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసుల నేతృత్వంలో నడిచే  ఈ ఇన్‌స్టిట్యూట్‌కి ఛైర్మన్‌గా హరిరామజోగయ్య వ్యవహరిస్తారు. నటన, దర్శకత్వ విభాగాల్లో ఈ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.