గుంటూరులో ఫిల్మ్ స్టూడియో..రూ. 500 కోట్లు పెట్టుబడి..!!?

గుంటూరులో ఫిల్మ్ స్టూడియో..రూ. 500 కోట్లు పెట్టుబడి..!!?

సినిమా షూటింగ్ చేయాలి అంటే హైదరాబాద్ స్టూడియోస్ లోనే షూటింగ్ చేయాలి.  హైదరాబాద్లో తప్పించి తెలుగు రాష్ట్రాల్లో స్టూడియోలు లేవు.  విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయి.  ఆ దిశగా అడుగులు పడుతున్నా.. ఇంకా అక్కడ నిర్మాణాలు ఏర్పాటు కాలేదు.  దీంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాణాలు హైదరాబాద్లోనే నిర్మితమౌతున్నాయి.  

అయితే, ఇప్పుడు హైదరాబాద్లో కాకుండా గుంటూరు జిల్లాలో దాదాపు రూ. 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఓ భారీ ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేయబోతున్నట్టు సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రకటించిన సంగతి తెల్సిందే.  ఇందుకోసం అంతర్జాతీయ సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు అయన తెలిపారు.  హాలీవుడ్లోని డిస్ని థీమ్ పార్క్ తరహాలో గుంటూరు జిల్లాలోని సూర్యలంకలో ఈ స్టూడియోను నిర్మించాలని అనుకుంటున్నారట.  ఏపీ టూరిజం శాఖ సమన్వయంతో ఈ స్టూడియోను ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.  ఒకవేళ ఇదే నిజమైతే.. ఏపీలో సినిమా రంగానికి జీవం పోసినట్టే అవుతుంది.