బాలాపూర్ లడ్డు ధరను అధిగమించిన ఫిల్మ్ నగర్ లడ్డూ !

బాలాపూర్ లడ్డు ధరను అధిగమించిన ఫిల్మ్ నగర్ లడ్డూ !

ఫిల్మ్ నగర్లోని వినాయక్ నగర్ బస్తీ గణేష్ లడ్డు బాలాపూర్ లడ్డు ధరను అధిగమించి వేలంపాటలో రికార్డ్ ధర పలికింది. ఈ ఉదయం బాలాపూర్ లడ్డూ వేలం నిర్వహించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలాన్ని హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం ఆసక్తిగా గమనించాయి. ఉత్కంఠ మధ్య పోటాపోటీగా జరిగిన వేలంలో గత రికార్డుల చెరిపేస్తూ 17లక్షల 60వేలకు కొలన్ కుటుంబసభ్యుడయిన కొలన్ రాంరెడ్డి దక్కించుకున్నారు. మరోపక్క ఫిలింనగర్లోని వినాయక్ నగర్ బస్తీలో గణపతి లడ్డూ ధర బాలాపూర్ లడ్డూ వేలం ధరను మించి పలికింది. రూ.17లక్షల 75 వేలకు గణేశ్ లడ్డూను దక్కించుకున్నారు బీజేపీ నేత పల్లపు గోవర్ధన్. గత ఏడాది వినాయక్ నగర్ వినాయకుడి లడ్డూ ధర రూ.15.1 లక్షలు పలికింది. గత ఏడాది నగరంలో రెండో స్థానంలో వినాయక్ నగర్ లడ్డూ నిలిచింది. 15 వేల రూపాయలతో ఆ రికార్డును చెరిపేసింది ఫిలిం నగర్ లడ్డూ.