తుది నిర్ణయం బాబుదే: మాగంటి

తుది నిర్ణయం బాబుదే: మాగంటి

ఎంపీగా పోటీ చేస్తానని సీఎం చంద్రబాబుకు తెలియజేసా. ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తాననేది చంద్రబాబు నిర్ణయిస్తారు. తుది నిర్ణయం ఆయనదే అని ఏలూరు ఎంపీ మాగంటి బాబు స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం, పక్క రాష్ట్రం, ప్రతిపక్షంతో మేము చేస్తున్న పోరాటం యుద్దాన్ని తలపిస్తోందన్నారు. రాష్ట్రం అలజడికి కారణం తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎంను తిడుతూ చేస్తున్న ప్రసంగాలు ఎవరికి మద్దతు ఇస్తున్నారో అర్దం అవుతుంది. చంద్రబాబుపై చేస్తున్న విమర్శలన్ని బురద జల్లడానికే అని మాగంటి బాబు అన్నారు. ఓట్ల తొలగింపు కార్యక్రమంలో మాపై ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ పోలీసులు ఓవారాక్షన్ చేస్తున్నారు. ముగ్గురే కాదు ఎంతమంది వచ్చినా టీడీపీని దెబ్బ తీయలేరన్నారు.