కాళేశ్వరంపై కేసులను త్వరగా తేల్చండి

కాళేశ్వరంపై కేసులను త్వరగా తేల్చండి

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసులన్నీ త్వరగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ దశలను సవాల్ చేస్తూ మొత్తం 177 వ్యాజ్యాలు దాఖలయ్యాయని.. వాటన్నింటినీ కలిపి విచారణ చేపట్టాలని కోరుతూ సర్కారు బుధవారం అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నందున.. వ్యాజ్యాలన్నీ కలిపి విచారణ చేపట్టి త్వరగా తేల్చాలని కోరింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అందించిన పునరావాస, ఉపాధి చర్యలపై నివేదిక సిద్ధం చేశామని.. అయితే రిజిస్ట్రీ సమయం అయిపోయిందని అదనపు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఆ నివేదికను నేరుగా తమకు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.