టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్.. ఫైనల్ రేస్‌లో ఆ నలుగురు..

టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్.. ఫైనల్ రేస్‌లో ఆ నలుగురు..

టీమిండియాకు త్వరలోనే కొత్త చీఫ్ సెలక్టర్ రానున్నాడు... ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్‌ ఖోడాల పదవీ కాలం ముగియడంతో.. కొత్త సెలక్టర్ల వేట మొదలు పెట్టింది బీసీసీఐ.. సెలక్టర్ల ఎంపిక బాధ్యతను మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీకి అప్పగించింది. అయితే, కొత్త సెలక్టర్ల ఎంపికకు నిర్దిష్టమైన సమయం ఏదీ లేకపోయినా.. వచ్చే నెల మొదటివారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మదన్‌లాల్ తెలిపారు. అయితే, ఇప్పటికే.. దరఖాస్తులు స్వీకరించడం.. ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తికాగా.. చివరి దశ ఇంటర్వ్యూలకు మాత్రం నలుగురు మిగిలారు. ఫైనల్‌గా మాజీ లెగ్‌స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్, మరో మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్‌లు.. ఫైనల్ రేస్‌లో ఉన్నారు. వీరిలో కూడా లక్ష్మణ్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని సమాచారం అందుతోంది. అనుభవం తీసుకుంటే మాత్రం... అజిత్ అగార్కర్‌కే చీఫ్ సెలక్టర్ పోస్టు దక్కే ఛాన్స్ ఉందంటున్నారు.. తన కెరీర్‌లో అగార్కర్ 26 టెస్టులు ఆడితే.. శివరామ కృష్ణన్ కేవలం 9 టెస్టులకే పరిమితమయ్యాడు.. దీంతో అగార్కర్‌కే అవకాశం దక్కుతుందనే ప్రచారం కూడా లేకపోలేదు.