మన్మోహన్‌తో నిర్మలా సీతారామన్ భేటీ..

మన్మోహన్‌తో నిర్మలా సీతారామన్ భేటీ..

భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌తో భేటీ అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లిన నిర్మలా సీతారమన్.. ఆయనతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ మాజీ ప్రధాని మన్మోహన్‌ను కలవడం ఇదే తొలిసారి. త్వరలోనే పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోన్న నిర్మలా సీతారామన్.. మన్మోహన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ సింగ్.. తాను ఆర్థికమంత్రిగా పనిచేసిన కాలంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.