మాకు అన్యాయం జరుగుతుంది.. పట్టించుకోండి

మాకు అన్యాయం జరుగుతుంది.. పట్టించుకోండి

15వ ఆర్థిక సంఘం సిఫారసుల వల్ల నిధుల కేటాయింపులో తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. దక్షిణాదితో పాటు కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో త్రివేండ్రంలో ఒకసారి.. అమరావతిలో ఏపీ ప్రభుత్వం రెండోసారి ఆర్ధిక మంత్రుల భేటీ నిర్వహించింది.. ఈ సమావేశంలో 15వ ఆర్థిక సంఘం సిఫారసులపై నిరసన వ్యక్తం చేయాలని.. రాష్ట్రపతి, ప్రధాని, ఆర్ధిక మంత్రి, 15వ ఆర్ధిక సంఘం ఛైర్మన్‌లను కలిసి తమకు ఎదురవ్వబోయే ఇబ్బందుల గురించి తెలియజెప్పాలని తీర్మానించాయి.

దీనిలో భాగంగా ఇవాళ ఆరు రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక మంత్రులు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి...15వ ఆర్ధిక సంఘం నియమ నిబంధనల సవరణలపై వినతిపత్రాన్ని అందజేయడంతో పాటు తమకు జరగబోయే నష్టం గురించి రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదిచ్చేరి, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉన్నారు.