షాన్‌మార్ష్‌ అవుట్.. స్కోర్ 29/2

షాన్‌మార్ష్‌ అవుట్.. స్కోర్ 29/2

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0) పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లోనే ఫించ్ ను అవుట్ చేసాడు. ఈ షాక్ నుండి తేరుకొనేలోపే కంగారూలకు మరో షాక్ తగిలింది. పేసర్ జఫ్రీత్ బుమ్రా వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి షాన్ మార్స్ (6) బౌల్డయ్యాడు. రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖావాజా (8), పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (13) క్రీజులో ఉన్నారు.