వాహనాలు మురికిగా ఉంటె ఫైన్ తప్పదు..!!

వాహనాలు మురికిగా ఉంటె ఫైన్ తప్పదు..!!

కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత దేశంలో జరిమానాలు విధిస్తున్నారు.  దీంతో ప్రజలు భయపడి వాహనాలను బయటకు తీసుకురావడం లేదు.  ఒకవేళ బయటకు తీసుకొచ్చిన అన్ని రకాల పత్రాలు ఉంటేనే బయటకు తీస్తున్నారు.  లేదంటే ప్రజా రవాణాను వినియోగించుకుంటున్నారు.  దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారి స్పందించి... రోడ్డుపై యాక్సిడెంట్స్ అవుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తుందని.. చట్టాలు సరిగ్గా లేవని.. పోలీస్ వ్యవస్థ సరిగా లేదని ప్రజలే మండిపడుతుంటారు.  చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తే ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏంటిని అంటున్నారు.  చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని.. ప్రజల సేఫ్టీ కోసమే వాహన చట్టం తీసుకొచ్చామని అన్నారు.  

ఇలాంటి జరిమానాలు మన దేశంలోనే కాదు ప్రపంచంలోని అమెరికా, రష్యా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో భారీగా ఉన్నాయి. అమెరికా విషయానికి వస్తే.. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే 25డాలర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే 1000డాలర్లు, హెల్మెట్ లేకుంటే 300 డాలర్లు చలానా విధిస్తారు.  అదే రష్యా విషయానికి వస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కు 50వేల రూబుల్స్ తో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.  సింగపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 5000 డాలర్లు ఫైన్ వేస్తారు.  వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడితే 1000 డాలర్ల ఫైన్ పడుతుంది.  దుబాయ్ లో అయితే ఫైన్ లు చాలా వింతగా ఉంటాయి. అక్కడి ప్రభుత్వం శుభ్రతకు ప్రాముఖ్యతను ఇస్తుంది.  మురికిగా ఉన్న వాహన కనిపిస్తే మొదట హెచ్చరిస్తారు.  దాంతో పాటు 500 దిర్హామ్ లు ఫైన్ వేస్తారు.  15 రోజుల తరువాత కూడా ఆ వాహనం అంతే మురికిగా కనిపిస్తే దాన్ని డంపింగ్ యార్డ్ కు పంపిస్తారట.  వీటితో పోల్చుకుంటే మనదగ్గర ఉన్న చట్టాలు తక్కువే అని చెప్పాలి.