సుశాంత్ ప్రియురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు

సుశాంత్ ప్రియురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో పరిస్థితులు అన్ని మారిపోయాయి. తాజాగా సుశాంత్ ప్రేమికురాలు రియాపై చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.సుశాంత్ మరణంపై నెలకొన్న అనేక వాదనలు, అనుమానాలు నివృత్తి కానున్నాయి. కేసు దర్యాప్తు బాధ్యతను తీసుకున్న సీబీఐ ప్రత్యేక బృందం రంగంలో దిగింది. ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఇప్పుడు రంగంలో దిగింది. డీజీపీ గగన్ దీప్ గంభీర్ ఈ విచారణను పర్యవేక్షించనున్నారు. కాగా సుశాంత్  ప్రియురాలు రియా చక్రవర్తి పై బీహార్ ప్రభుత్వం ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.  రియా చక్రవర్తి తోపాటు .. ఇంద్రజిత్ చక్రవర్తి,  సంధ్య చక్రవర్తి,  అశోక్ చక్రవర్తి , శామ్యూల్, శృతి మోడీ లపై సీబీఐ కేసు నమోదు చేసింది.  20 పేజీలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ . మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద వీరిపై  సీబీఐ కేసును నమోదు చేసింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్  కూడా రంగంలో దిగింది. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో  రియా చక్రవర్తి కి సమన్లు పంపించింది ఈడీ.