హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెయిన్ రోడ్ పై ఉన్న ఓ ఫర్నిచర్ షోరూంలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించడంతో ఆబిద్స్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.