జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

ఖమ్మం జిల్లా మధిర మండలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాటూర్‌ గ్రామంలోని మంజిత్‌ కాటన్‌ మిల్లులో సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

పత్తిబేళ్లు, యంత్రాలకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.