సంజీవయ్య పార్కు వద్ద అగ్నిప్రమాదం

సంజీవయ్య పార్కు వద్ద అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని సంజీవయ్య పార్కు వద్ద అగ్నిప్రమాదం జరిగింది. కంపోస్ట్ ఎరువు కోసం ఉంచిన ఎండుగడ్డికి నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం వల్ల పార్కులోని అనేక చెట్లకు మంటలు అంటుకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఒకటే ఫైరింజిన్‌ ఉన్నందున మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు తెలుస్తుంది.