కర్నూలులో పేలిన గ్యాస్ ఆటో 

కర్నూలులో పేలిన గ్యాస్ ఆటో 

కర్నూలు లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోలోని సీఎన్జీ గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎండవేడిమి కారణంగానే గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలుస్తుంది. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు నుంచి కల్లూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.