చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి... దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం నెంబర్‌ 6లో రైలును నిలిపి ఉంచిన సమయంలో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.