హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం !

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం !

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ఓ హార్డ్ వేర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. రాందేవ్ ఎలక్ట్రికల్ అనే హార్డ్ వేర్ షాపులో అగ్నిప్రమాదం జరగటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నాయి. మంటలు చెలరేగిన షాప్ కిందనే సీఎంఆర్ జూవెలరీ షాప్ ఉండటంతో భారీగా ఆస్తి నష్టం జరుగుంతుందని అంచనా వేస్తున్నారు. పక్కనే ఉన్న బట్టల షోరూమ్ లు, ఇంకో పక్కన  జోయలుక్కాస్ బంగారం షోరూమ్ ఉండటంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.