కాకినాడలో భారీ అగ్నిప్రమాదం..

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం..

కాకినాడ మెయిన్ రోడ్డులోని గ్లాస్‌ హౌస్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువజామున 4గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో రూ. 2కోట్ల ఆస్తి నష్టం జరిగింది. సూపర్ మార్కెట్‌లో చెలరేగిన మంటలు మూడు ఫ్లోర్లకు వ్యాపించాయి. సూపర్‌ మార్కెట్‌లో ప్లాస్టిక్‌ వస్తులు, స్కూల్‌ బ్యాగులు, రెడీమేడ్‌ వస్త్రాల షాపులు ఉండడంతో మంటల తీవ్రత బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కాణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.