మీర్ చౌక్ లో భారీ అగ్నిప్రమాదం

మీర్ చౌక్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాతబస్తీలోని దివాన్ దేవిడిలోని అబ్బాస్ టవర్ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. రోషన్ ట్రేడర్స్ అనే బట్టల దుకాణంలో మంటలు వ్యాపించడంతో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. కిడ్స్ వేర్ మొత్తం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గ్రౌండ్, సెకండ్ ఫ్లోర్ లలోని వ్యాపార సముదాయాలకు మంటల వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.