షార్ట్ సర్క్యూట్ తో కారులో మంటలు

షార్ట్ సర్క్యూట్ తో కారులో మంటలు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తోగర్రాయి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెలుతున్న ఇండికా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రాకపోవడంతో కారు పూర్తిగా దగ్థమైంది. షార్ట్ సర్క్కూట్ కారణంగానే కారులో మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు.