వరంగల్ లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

వరంగల్ లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

వరంగల్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. కోటిలింగాలలోని భద్రకాళి ఫైర్‌ వర్క్స్ గోదాములో ఈరోజు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో గోదాములో బాణాసంచా దగ్ధమైంది. ఈ ప్రమాద సమయంలో గోదాములో 15 మంది పని చేస్తున్నట్లు  సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 11 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గోదాంలో మృతదేహాలు చెల్లాచెదురుగా 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. దీంతో ఎవరి మృతదేహం ఏదో అని గుర్తించలేని పరిస్థితి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ లతో మంటలు ఆర్పుతున్నారు. గోదాంలో ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కార్మికుల మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో ఫైర్ వర్క్ గోదాం యాజమాన్యం పరారీలో ఉంది.