ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం

ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం

రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆపరేషన్ థియేటర్ లో మంటలు వ్యాపించినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది. నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయని పేర్కొంది. విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ట్రామా సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపలి నుంచి మంటలు బయటికి వ్యాపించడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. అని ఎయిమ్స్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ ఏఎన్ఐ కి తెలిపారు.