గ్రేటర్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం

గ్రేటర్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం

గ్రేటర్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 12లోని మెట్రో ఆసుపత్రిలో ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అద్దాలు పగులగొట్టి రోగులను బయటికి చేర్చారు. సమాచారం అందుకున్న వెంటనే 12 అగ్ని మాపక శకటాలు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.