బ్రేకింగ్‌ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

బ్రేకింగ్‌ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ స్టీల్‌ ప్లాంటులో అగ్ని ప్రమాదం ఇవాళ ఉదయం జరిగింది. ప్లాంటులోని టీపీపీ-2 లో మంటలు చెలరేగాయి. టర్బైన్‌ ఆయిల్‌ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. ఈ ఘటనలో 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటార్లు దగ్ధమయ్యాయి. రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. అయితే..వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పడంతో పెనుప్రమాదమే తప్పింది.  కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు, ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. కాగా..ఏపీలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటికే  చాలా అగ్నిప్రమాదాలు జరిగాయి. ఇక విజయవాడ కోవిడ్‌ సెంటర్‌, అంతర్వేదిలో అగ్ని ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే...