ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదానికి 17మంది ఆహుతి

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదానికి 17మంది ఆహుతి

ఢిల్లీలో ఇవాళ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కరోల్‌ బాగ్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదం జరిగి 17 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ మహిళ, చిన్నారి కూడా ఉన్నారు. అత్యంత రద్దీగా ఉండే కరోల్‌బాగ్‌ ప్రాంతంలో గల మూడంతస్తుల అర్పిత్‌ ప్యాలెస్‌ హోటల్‌లో  తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మంటలు వ్యాపించగానే కొందరు భవనం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కొందరు టెర్రస్ పైనుంచి, భవనం కిటికీల నుంచి కిందకు దూకారు. ఈ క్రమంలో ఓ మహిళ, చిన్నారి మృతిచెందారు. మిగతావారు మంటల్లో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా పలువురు భవనంలో చిక్కుకోగా వారి కోసం సహాయకసిబ్బంది గాలిస్తున్నారు అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.