వైసిపి సంక్రాంతి సంబరాల్లో అపశృతి

వైసిపి సంక్రాంతి సంబరాల్లో అపశృతి

కాకినాడ రూరల్ లో జరిగిన  వైసిపి  సంక్రాంతి సంబరాల్లో అపశృతి జరిగింది.  అచ్చంపేట జంక్షన్ లో సంక్రాంతి సంబరాల సందర్భంగా భోగి మంటలు వెలిగిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తండ్రి పంచె అంటుకుంది. పక్కనున్న వాళ్లు మంటను ఆర్పినా.. కన్నబాబు తండ్రి సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.