పార్క్‌ చేసిన కారులో మంటలు

పార్క్‌ చేసిన కారులో మంటలు

ఇంటి ముందు పార్క్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. హైదరాబాద్ మోతీనగర్‌లో ఈ ఘటన జరిగింది.  ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన శాంత్రో కారు నిన్న అర్థరాత్రి మంటల్లో మాడిమసైపోయింది. ప్రమాదవశాత్తూ కారు తగలబడిందా లేక అగంతకులెవరైనా నిప్పంటించారా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.