ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అగ్ని ప్రమాదం

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నిన్న అర్ధరాత్రి  అగ్ని ప్రమాదం జరిగింది. క్యాష్ కౌంటర్స్, బ్యాంకు మేనేజర్ క్యాబిన్, సిబ్బంది విధులు నిర్వర్తించే క్యాబిన్లు అగ్నికి ఆహుతయ్యాయి. కంప్యూటర్లు, ఫర్నిచర్, కీలకమైన డాక్యుమెంట్లు కాలిపోయాయి.

ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బ్యాంకు లోపల నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు, అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు.  అగ్నిమాపకశాఖ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్నిఅదుపులోకి తెచ్చారు.