ఎన్టీఆర్‌ విగ్రహాలకు నిప్పు..

ఎన్టీఆర్‌ విగ్రహాలకు నిప్పు..

గుంటూరు జిల్లాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను ధ్వంసం చేయడం, విగ్రహాలకు నిప్పుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరులోని మూడు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టారు దుండగులు. స్తంభాలగరువు, నెహ్రూ నగర్, ఏటుకూరు రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను నిప్పుపెట్టారు. విగ్రహాలకు వస్త్రాలను చుట్టి.. ఆ వస్త్రాలను దగ్ధం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ విగ్రహాలు నల్లగా మారిపోయాయి. మరోవైపు నెహ్రూ నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహం తలను విరగగొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో రాస్తారోకుకు దిగిన టీడీపీ నేతలు... అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.