నిరాశపరిచిన భారత్... ఇలా అయితే కష్టమే..!

నిరాశపరిచిన భారత్... ఇలా అయితే కష్టమే..!

ఈ రోజు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే... అయితే ఈ మ్యాచ్ లో మొదటి రోజు భారత్ తన ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ తన అద్భుత ప్రదర్శనతో టెస్ట్ లో మొదటి స్థానం లో ఉన్న భారత్ ని భయపెట్టింది. అయితే 55 ఓవర్లు ముగిసిన తరువాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అయితే క్రమం తప్పకుండ వికెట్లు తీస్తూ వచ్చిన కివీస్ బౌలర్లు మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ ని 122 పరుగులకు కట్టడి చేసి 5 వికెట్లు తీసుకున్నారు. అయితే భారత్ బ్యాట్స్మెన్స్ లో మయాంక్ అగర్వాల్(34) రహానే (38*) కొంచెం చెప్పుకోదగిన పరుగులు చేసారు. అయితే కివీస్ తరుపున మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కైల్‌ జేమీసన్‌ 3 వికెట్లు తీసుకున్నాడు. అయితే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రహానే (38), పంత్ (10) నాటౌట్ గా నిలిచారు.