ఆసక్తిగా నెట్‌ఫ్లిక్స్ మొట్టమొదటి తెలుగు సినిమా టీజర్..

ఆసక్తిగా నెట్‌ఫ్లిక్స్ మొట్టమొదటి తెలుగు సినిమా టీజర్..

ప్రపంచంలోని అతిపెద్ద స్ట్రీమింగ్ సంస్థల్లో నెట్‌ఫ్లిక్స్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది ప్రపంచమంతటా చాలా పాపులర్ స్ట్రీమింగ్ యాప్. ఇంతటి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ఇప్పుడు తమ మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ సినిమాను సమర్పిస్తోంది. అది కూడా తెలుగులో మోస్ట్ టాలెంటెడ్ పేరు తెచ్చుకున్న దర్శకులతో దీనిని నిర్మిస్తుంది. దీనికి పిట్ట కథలు అనే పేరును ఖరారు చేశారు. దీనిని పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్, అలా మొదలైంది ఫేమ్ నందిని రెడ్డి, ఘూజీ ఫేమ్ సంకల్ప రెడ్డి వీరితో పాటుగా మహానటి ఫేమ్ నాగ్‌అశ్విన్‌లు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్సే కాకుండా స్టార్ హీరోయిన్లతో ఈ సినిమా రూపొందనుంది. అమలా పాల్, శ్రుతి హాసన్, ఈషో రెబ్బా వంటి తదితర నటులతో దీనిని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో నాలుగు విభిన్న కథలు ఉన్న మహిళలు వారి జీవితంలోని ప్రేమ, ఎమోషన్స్ వాటితో వారు నలుగురికి ఉన్న కామన్ కానెక్షన్ ఏంటన్న దానిపై ఎంతో బోల్డ్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన దీని టీజర్ ఎంతో ఆసక్తిని రేపుతోంది. దీనిని నెట్‌ఫ్లిక్స్ వారు వచ్చేనెల 19న స్ట్రీమ్ చేయనున్నారు.