తొలి టీ20: ఆసీస్ బ్యాటింగ్

తొలి టీ20: ఆసీస్ బ్యాటింగ్

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌ లో టీమిండియా టాస్ గెలిచింది. భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌ పరిస్థితులు బౌలింగ్‌కే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. మరోవైపు ముందుగా టాస్‌ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆసీస్‌ సారథి ఫించ్‌ అన్నాడు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌