హైదరాబాద్ లో నోరూరిస్తున్న ఫిష్ ఫెస్టివల్

హైదరాబాద్ లో నోరూరిస్తున్న ఫిష్ ఫెస్టివల్

హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఫిష్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్‌లో రకరకాల చేపల కూరలు, రొయ్యలు, పీతల కూరలను భోజన ప్రియులకు కోసం అందుబాటులో ఉంచింది. వారాంతం ఆదివారం కావడంతో ఎక్కువ మంది సందర్శకులు ఈ ఫెస్టివల్‌కి వచ్చి వివిధ రకాల ఫిష్ వంటకాలను లాగిస్తున్నారు. మృగశిరకార్తీ సందర్భంగా జూన్ 8 నుంచి 9 వరకు ఫిష్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. 2006 నుంచి ఎన్‌డీఎఫ్‌బీ దేశవ్యాప్తంగా ఫిష్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తుంది. విశాఖపట్నం, మంగళూరు, పాట్నా, ఢిల్లీ, కోల్‌కతా, విజయవాడ, గౌహతీ, త్రిపురా, హైదరాబాద్ నగరాల్లో ఏర్పాటు చేస్తున్న ఫిష్ ఫెస్టివల్స్ కు మంచి ఆదరణ లభిస్తుంది.