నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ..

నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ..

ఎండలతో అల్లాడిపోయిన ప్రజలు మృగ‌శిర‌ కార్తె ప్రవేశంతో ఉపశమనం పొందుతున్నారు. ఇప్పటికే వాతావరణం చల్లబడిపోయింది. మరోవైపు మృగశిర కార్తె ప్రవేశం రోజే పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరాయoగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు, వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీకి మొత్తం 36 కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక లక్షా 60 వేల కోర్ర మేను చేప పిల్లలను పంపిణీకి సిద్ధం చేసింది మత్స్యశాఖ... మరోవైపు, శంషాబాద్ విమానాశ్రయం, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు నేరుగా వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా 100 బస్సులను నడుపుతోంది. 3 లక్షల 50 వేల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు అధికారులు. వరుసగా మూడేళ్లు చేప ప్రసాదం స్వీకరిస్తే ఆస్తమా రోగం నయం అవుతుందనే నమ్మకం ఉండగా.. 1845 నుంచి చేప మందును పంపిణీ చేస్తున్నారు బత్తిని సోదరులు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా ఆస్తమా బాధితులు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.