షాకింగ్ న్యూస్: భూమివైపు దూసుకొస్తున్న ఐదు భారీ గ్రహశకలాలు... నాలుగు రోజులు టెన్షనే...!!

షాకింగ్ న్యూస్: భూమివైపు దూసుకొస్తున్న ఐదు భారీ గ్రహశకలాలు... నాలుగు రోజులు టెన్షనే...!!

2020 అంతా చాలా బ్యాడ్ గా ఉన్నది.  2020 జనవరి నుంచే ప్రపంచం అనేక విపత్తులను ఎదుర్కొంటున్నది.  2019 లో మొదలైన అమెజాన్ అడవుల దహనం 2020 లోను కంటిన్యూ అవుతున్నది.  దీంతో పాటు చైనాలో పుట్టిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. గత ఆరు నెలలుగా ప్రపంచం మొత్తం కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ వైరస్ నుంచి బయటపడకపోవడం విశేషం.  ఎప్పుడు వీటి నుంచి బయటపడుతుందో తెలియని పరిస్థితి.  మరోవైపు భూకంపాలు, తుఫానులు, ఆకలి చావులు.  ఇవీ చాలదన్నట్టు నిరుద్యోగ సమస్య.  ఇలా ఒక్కటేమిది వందలాది సమస్యలు 2020లో భూమిని పట్టి పీడిస్తున్నాయి.  

ఇప్పుడు అయితే, భూమికి ఇప్పుడు మరొక కొత్త సమస్య వచ్చి పడింది.  అదేమంటే,  భూమివైపుకు ఐదు గ్రహ శకలాలు దూసుకొని వస్తున్నట్టుగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతానికి ఒక్కొక్కటి 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.  ఇవి భూమివైపు వేగంగా దూసుకొని వస్తున్నట్టు తెలుస్తోంది.  ఏ సమయం వరకు ఇవి భూమికి సమీపంలోకి వస్తాయో తెలియదు.  నాలుగైదు రోజులపాటు నిత్యం అలర్ట్ గా ఉండాలని నాసా హెచ్చరిస్తోంది.  60 నుంచి 70 అడుగుల వ్యాసంలో ఉన్న గ్రహ శకలాలు చిన్నవే అయినప్పటికీ, వేగంగా దూసుకొచ్చి ఢీకొంటే భారీ ప్రమాదం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.