ఐదు బ్యాంకులపై ఈడీ నిఘా...

ఐదు బ్యాంకులపై ఈడీ నిఘా...
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అడ్డదారిలో రుణాలు పొందిన నీరవ్ మోడీ... వాటిని విదేశాలకు తరలించినట్టు గుర్తించింది. ఇందులో సహాయపడిన ఐదు బ్యాంకుల లావాదేవీలపై దృష్టిసారించింది. నీరవ్, మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ నుంచి లెటర్ ఆఫ్ అండర్ టేగింగ్‌ల ద్వారా రూ.13 వేల కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. వీరిద్దరూ మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. డొల్ల కంపెనీల ద్వారా నీరవ్ ఇతర కంపెనీలకు నిధులు మళ్లించారని... న్యూయార్క్, యూఏఈ, బెల్జియం సహా ఇండియాలోని ఇతర సంస్థల దగ్గర నిధులు రౌండ్ ట్రిఫింగ్‌కు పాల్పడినట్టు దర్యాప్తులో గుర్తించింది ఈడీ. నీరవ్, చోక్సీ నిధుల మళ్లింపుతో సంబంధం ఉన్న 120 డొల్ల కంపెనీలను గుర్తించింది ఈడీ... వీటి ద్వారా జరిపిన లావాదేవీలపై దృష్టిసారించినట్టు గతంలోనే సీబీఐ ప్రకటించింది. పలు బ్యాంకుల ద్వారా విదేశాలకు నిధుల మళ్లింపునకు సంబంధించి... ఆర్బీఐని ఈడీ మరింత సమాచారం కోరింది. నీరవ్ మోడీ వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు, యాక్సిస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా లావాదేవీలపై నిఘా పెట్టింది ఈడీ.