భారీ బడ్జెట్ శతాబ్దం.. మల్టీస్టారర్ల యుగం...

భారీ బడ్జెట్ శతాబ్దం.. మల్టీస్టారర్ల యుగం...

ఇప్పుడు రూ.100 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే సర్వసాధారణం అయిపొయింది.  ఆ వందకోట్లేనా అనే స్థాయికి వచ్చింది. సినిమా మార్కెట్ పరిధి విస్తరించడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  సినిమా ఎలా ఉన్నా.. వాటిని మార్కెట్ చేసుకుంటుండటంతో.. పెట్టిన డబ్బులు వెనక్కి వస్తున్నాయి.  దీంతో ఇప్పుడు ఎంత బడ్జెట్ అయినా సరే పెట్టేందుకు ముందుకు వస్తున్నారు నిర్మాతలు.  

ఈ ఏడాది ఐదు భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.  వాటిల్లో మొదటగా చెప్పుకోవలసిన సినిమా ఆర్ఆర్ఆర్.  ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ లు నటిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.350 నుంచి రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  రజినీకాంత్ 2పాయింట్ 0 తరువాత ఆ స్థాయిలో ఖర్చు చేస్తున్న సినిమా ఇది.  రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.  జులై 30, 2020 న రిలీజ్ అవుతుంది.  

ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో వస్తున్న మరో మల్టీస్టారర్ సినిమా సైరా.  మెగాస్టార్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోంది.  మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాకోసం నిర్మాత రామ్ చరణ్ దాదాపుగా రూ.250 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారట.  

 

బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర, కళాంక్, మలయాళంలో మరక్కార్ సినిమాలు భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.  2019 ద్వితీయార్ధంలోను అలాగే వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గాను ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.