చిత్తూరులో ఘోర ప్రమాదం..

చిత్తూరులో ఘోర ప్రమాదం..

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రేణిగుంట మండలం గురవరాజుపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆగిఉన్న లారీని వెనక వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన జైలో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. గుంటూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు... తీవ్రగాయాలపాలైన ఐదుగురుని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు.