అంత్యక్రియలకు వెళ్తుండగా కూలిన చిన్న విమానం.. అందరూమృతి..

అంత్యక్రియలకు వెళ్తుండగా కూలిన చిన్న విమానం.. అందరూమృతి..

అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో జరిగిన విమాన ప్రమాదంలో... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా మొత్తం ఐదుగురు మృతిచెందిన ఘటన అమెరికాలోని జార్జియాలో జరిగింది.. జార్జియా రూరల్‌ ఏరియాలో జరిగిన ఈ ప్రమాదంలో.. ఇండియానాలో అంత్యక్రియలకు వెళుతున్న ఫ్లోరిడా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులతో సహా విమానంలో ఉన్న ఐదుగురు మృతి చెందారు.. అట్లాంటాకు ఆగ్నేయంగా 100 మైళ్ల దూరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.. ఈ చిన్న విమానంలో ఉన్న ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కూడా ప్రాణాలు విడిచారు. పైపర్ పీఏ31-టీ ఫ్లోరిడాలోని విల్లిస్టన్ నుండి ఇండియానాకు ఎగురుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.