చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్‌

చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్‌

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగిరి నియోజక వర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో(అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు) రీపోలింగ్‌ జరగనుంది. 321-ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌కే రుడోలా నోట్‌ విడుదల చేశారు.