ఫ్రెంచ్ ఓపెన్ ఆటగాళ్లకు కరోనా...

ఫ్రెంచ్ ఓపెన్ ఆటగాళ్లకు కరోనా...

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు ఈ వైరస్ ఫ్రెంచ్ ఓపెన్ పై పంజా విసురుతుంది. గ్రాండ్ స్లామ్ క్వాలిఫయర్స్ కు ముందే ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకింది. దాంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే కరోనా కారణంగా 6 నెలలు జరగని క్రీడలు మళ్ళీ ఇప్పుడిపుడే ప్రారంభమవుతున్నాయి. టెన్నిస్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఈ నెల 27 నుండి వచ్చే నెల 11 వరకు ప్యారిస్ లో జరగనుంది.. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు క్వాలిఫైర్ మ్యాచ్ లో పాల్గొనే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరు ఆటగాళ్లతో పాటుగా ఒక కోచ్ కూడా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే మరో ముగ్గురు ఆటగాళ్లు ఆ కోచ్ కు సన్నిహితంగా ఉండటంతో వారిని క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కానీ వారు ఎవరు అనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు.ఈ టోర్నీలో జకోవిచ్, నాదల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. అయితే ఇప్పటివరకు ప్రారంభమైన క్రీడలను వీక్షించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వటం లేదు. కానీ ఫ్రెంచ్‌ ఓపెన్ టోర్నీమైదానం లోకి ప్రేక్షకులకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. మరి ఇప్పుడు ఆ నిర్ణయం ఏమైనా మార్చుకుంటారా అనేది చూడాలి.