తమ టాలెంట్ గుర్తించలేదని క్రికెట్ ను వదిలేసిన స్టార్ క్రికెటర్స్ వీరే..

తమ టాలెంట్ గుర్తించలేదని క్రికెట్ ను వదిలేసిన స్టార్ క్రికెటర్స్ వీరే..

మన కష్టానికి తగ్గిన ప్రతిఫలం రాకపోతే ఎవరైనాసరే నిరాశ చెందుతారు. ఆ సమయంలో వారికి బాధ కోపం రెండు ఒక్కేసారి వస్తాయి. అలాంటిసమయంలోనే తొందరపాటుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలా తమ టాలెంట్ గుర్తించలేదని అలిగి తమ తమ బోర్డులతో గొడవ పెట్టుకొని క్రికెట్ ను వదిలేసిన స్టార్ క్రికెటర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

కెవిన్ పీటర్సన్ : తాను ఆడుతున్న సమయంలో పీటర్సన్ ఇంగ్లాండ్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు. కానీ తన ప్రవర్తన కారణంగా ఎప్పుడైతే తన టీం మేనేజ్మెంట్ తో అలాగే తోటి ఆటగాళ్లతో విబేధాలు రావడం మొదలు పెట్టాయో అందరూ అతనికి వ్యతిరేకం అయ్యారు. ఇక ఇంగ్లాండ్-ఆసీస్ మధ్య  ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే 'యాషెస్' లో కెవిన్ రాణించకపోవడం... జట్టు ఓడిపోవడంతి జరిగిందో ఎటువంటి కారణాలు చెప్పకుండా అతడిని జట్టు నుండి తప్పించారు. దాంతో అతను తన రిటైర్మెంట్ ప్రకటించాడు

గౌతమ్ గంభీర్ : గంభీర్ ఎటువంటి ఆటగాడో అందరికి తెలుసు. వరల్డ్ కప్ హీరోగా పేరు సంపాదించుకున్న గంభీర్ భారత్ ఓజయం సాధించిన 2007 టీ 20 ప్రపంచ కప్, 2011 కండె ప్రపంచ కప్ ఫైనల్స్ తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కానీ తర్వాత ధోనితో వచ్చిన విబేధాల కారణంగా అతనికి మళ్ళీ జట్టులో స్థానం దక్కలేదు. ఆ సమయంలో కెప్టెన్ గా ధోని టాప్ లో ఉండటంతో బీసీసీఐ కూడా ఏం చేయలేకపోయింది.  ఐపీఎల్ లో గంభీర్ ఎంత ఆడిన భారత జట్టులో స్థానం రాకపోవడంతో 2018 లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

షోయబ్ అక్తర్ : అక్తర్ స్పీడ్ బౌలింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లెట్ లాంటి తన బంతులతో బ్యాట్స్మెన్స్ కు చుక్కలు చూపించేవాడు. కానీ 2007 లో పాక్ బోర్డు పై నిందలు వేసిన అక్తర్ తోటి ఆటగాళ్లతో గొడవలు పెట్టుకోవడంతో... తమ నియమాలను అక్తర్ ఉల్లంఘించారని బోర్డు అతనికి జీవిత కాలం నిషేధాన్ని విధించింది. కానీ తర్వాత దానిని కుదించి మళ్ళీ జట్టులో అవకాశం ఇచ్చిన తర్వాత ఎక్కువ మ్యాచ్ లలో ఆడలేదు. దాంతో మళ్ళీ 2012 లో పాకిస్థాన్ బోర్డులో రాజకీయాలు జరుగుతున్నాయి అని అక్తర్ చేసిన వ్యాఖ్యలు అతను క్రికెట్ కెరియర్ కు ముగింపు పలికాయి.

డ్వేన్ బ్రావో : ఐపీఎల్ లో అద్భుతమైన బౌలర్ గా పేరొందిన బ్రావోకు అలాగే వెస్టిండీస్ బోర్డు కు మధ్య జరిగిన గొడవ కారణంగా అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తమకు ఇవ్వాల్సిన వేతనాలు బోర్డు ఇవ్వడం లేదు అని చెప్పిన బ్రావో... తన దేశ డొమెస్టిక్ క్రికెట్ లో ఆడాల్సిన మ్యాచ్ లను  కూడా వదిలేసి వచ్చి ఐపీఎల్ లో ఆడాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు బోర్డుతి విబేధాలు తొలిగిపోవడంతో 2019 ప్రపంచ కప్ ముందు తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని జట్టులో చేరాడు.

అంబటి రాయుడు :  అంబటి రాయుడికి అలాగే సెలక్షన్ కమిటీకి ఉన్న గొడవలు అందరికి తెలుసు. గత ఏడాది జరుగును ప్రపంచ కప్ లో తనకు బదులుగా మొదట విజయ్ శంకర్ ను ఆ తర్వాత మయాంక్ ను సెలక్ట్ చేయడంతో కోపంలో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకొని ప్రస్తుతం ఐపీఎల్ 2020 లో ఆడుతున్నాడు. ఈ సీజన్ మొదట్లో అద్భుతంగా రాణించిన రాయుడు తర్వాత గాయమ్ కారణంగా బాగా ఆడలేకపోతున్నాడు.