ఫేమింగ్‌ సర్వ్ః 750 బార్, పబ్ లకు నోటీసులు

ఫేమింగ్‌ సర్వ్ః 750 బార్, పబ్ లకు నోటీసులు

ఫ్లేమింగ్ షాట్ సర్వ్ చేస్తున్న బార్లకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) నోటీసులు జారీ చేసింది. ఇలా మందును సర్వ్ చేయడానికి ముందు తగిన అగ్ని ప్రమాదం వంటి విపత్తులు జరిగితే తక్షణం చర్యలు తీసుకునేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు ఉండి తీరాలని జీహెచ్ ఎంసీ భావిస్తోంది. ఇలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు గురించి హైదరాబాద్ లోని 750 బార్లకు జీహెచ్‌ ఎంసీలోని ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం నోటీసులు జారీ చేసింది. తగిన భద్రతా చర్యలు తీసుకునేందుకు రెండు నెలల గడువు ఇచ్చింది. అలాకాకుండా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే బార్ ఉన్న భవనాన్ని కూడా జప్తు చేస్తామని స్పష్టం చేసింది. నగరంలో దాదాపు 800 పబ్ లు, బార్లు ఉండగా.. కనీసం 400 పబ్లు, బార్లు కనీసం ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎలాంటి కనీస భద్రతా ప్రమాణాలు లేవని జీహెచ్ ఎంసీ వర్గాలు అంటున్నాయి.