నిలకడగా ప్రారంభమైన నిఫ్టి

నిలకడగా ప్రారంభమైన నిఫ్టి

ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండగా... నిఫ్టి నిలకడగా ప్రారంభమైంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగియగా, యూరో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. మిగిలిన సూచీల్లో పెద్దగా నష్టాల్లేవ్‌. నిఫ్టి స్వల్ప నష్టంతో ప్రారంభమైనా... కొద్ది నిమిషాల్లోనే గ్రీన్‌లోకి వచ్చింది. ప్రస్తుతం 10822 వద్ద ట్రేడవుతోంది. అమెరికా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడంతో మన మార్కెట్‌ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ షేర్లు ఒకటిన్నర నుంచి రెండు శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. అలాగే టాటా మోటార్స్‌ కూడా ఒకటిన్నర శాతం లాభపడింది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో వేదాంత 2 శాతం నష్టంతో టాప్‌లో ఉంది. హిందాల్కో, కొటిక్‌ బ్యాంక్‌ దాదాపు రెండు శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఇలో ఐడియా నాలుగు శాతం, స్టార్‌ షేర్‌ నాలుగు శాతం వరకు లాభపడ్డాయి.