నీళ్ళు అడిగానంతే...

నీళ్ళు అడిగానంతే...

అతడి పేరు రిఫత్‌ జావేద్‌. గోరఖ్‌ పూర్‌ నుంచి ఢిల్లీ వెళుతున్నాడు. ఎయిర్‌ ఇండియా అలయన్స్‌ విమానం. రంజాన్‌ మాసం కావడంతో అతను రోజా (ఉపవాసం) ఉన్నాడు. ఇఫ్తార్‌ సమయం కాగానే సీట్లో నుంచి వెళ్ళి కేబిన్‌ క్రూ సిబ్బందిని నీటి బాటిల్‌ కోసం అడిగాడు. మంజులా అనే ఉద్యోగి చిన్న వాటర్‌ బాటిల్‌ ఇచ్చింది. ఉపవాసం ఉన్నానని మరో బాటిల్‌ ఇవ్వరా అడగడంతో... మీరు సీటు నుంచి ఎందుకు లేచి వచ్చారు? అంటూ జావేద్‌ను ఆయన సీటు వద్దకు వెళ్ళమని చెప్పింది. కొన్ని నిమిషాల్లో మరో నీటి బాటిల్‌ తో పాటు రెండు శాండవిచ్‌లు ఇచ్చి... ఇంకా కావాలంటే మొహమాటం లేకుండా అడంగడని చెప్పింది మంజులా. మంజుల అభిమానంతో ఆశ్చర్యపోయిన జావేద్‌ తన అనుభవాన్ని వెంటనే ట్వీట్‌ చేశాడు. 'దిస్‌ ఈజ్‌ మై ఇండియా' అంటూ ట్వీట్‌ ముగించాడు. జావేద్‌ ట్వీట్‌కు సామాజిక మీడియాలో అనేక మంది స్పందించి... తమ ఆనందాన్ని పంచుకున్నారు.