విమానాల రద్దు నిర్ణయం వెనక్కి..

విమానాల రద్దు నిర్ణయం వెనక్కి..

భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాల రాకపోకలపై ఇవాళ ఉదయం విధించిన ఆంక్షలను భారత్‌ ఎత్తివేసింది. మూడు రాష్ట్రాలలోని 8 విమానాశ్రయాలలో 3 నెలలపాటు పౌరవిమానయాన సేవలు రద్దు నిర్ణయం ఉపసంహరించుకుంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచల ప్రదేశ్‌లో విమానయాన సేవలు యధావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. 
ఇవాళ ఉదయం నుంచి జమ్మూ, శ్రీనగర్, లేహ్‌, అమృత్‌సర్‌, ఛత్తీస్‌గఢ్‌, ధర్మశాల, డెహ్రాడూన్ విమానాల సర్వీసులను ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానయాన సంస్థలు నిలిపివేశాయి.