ఆ పండు కోసం విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారట..!!

ఆ పండు కోసం విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారట..!!

అనగనగా ఓ విమానం.. ఆ విమానం కెనడాలోని మోంట్రియల్ నుంచి వాంకూవర్ కు ప్రయాణం చేస్తోంది.  ప్రయాణికులంతా ఎక్కేశారు.  అంతా ఒకే.. ఫ్లైట్ కంట్రోల్ నుంచి టేకాఫ్ కు సిగ్నల్స్ వచ్చాయి.. విమానం టేకాఫ్ అయ్యింది.  అలా టేకాఫ్ అయినా కాసేపటికి విమానంలో తట్టుకోలేనంత దుర్వాసన వచ్చింది.  ముక్కుపుటాలు పగిలేంత కంపు. అసలు ఆ కంపుకు కారణం ఏంటో చెక్ చేశారు.. విమానంలోని కార్గో లగేజీలో డ్యూరియన్ అనే పండు ఉన్నది.  రుచికి ఆరోగ్యానికి చాలా మంచిది.  కాకపోతే, దాని నుంచి వచ్చే వాసన తట్టుకోవడమే కష్టం.  కుళ్లిపోయిన వాసన వస్తుంది.  

వాసన తట్టుకోలేకపోవడంతో ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించి మోంట్రియల్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.  కార్గోలో ఉన్న డ్యూరియన్ పండును బయటకు కార్గో నుంచి తీసేసి.. శుభ్రం చేసిన తరువాత తిరిగి ఫ్లైట్ బయలుదేరింది.  ఈ పండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దాని నుంచి వచ్చేవాసనను తట్టుకోలేరు కాబట్టి దాన్ని చాలా రెస్టారెంట్స్ లో వినియోగించరు.